
మాట్లాడుతున్న ఈఆర్‌ఓ వెంకటశివ
పాలసముద్రం : ఎన్నికల విధులను బీఎల్‌ఓలు బాధ్యతగా నిర్వర్తించాలని ఐఓసీఎల్ డిప్యూటి కలెక్టర్ (ఈఆర్‌ఓ) వెంకటశివ తెలిపారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దులోని మండలాల్లో కొత్త ఒటర్లు నమోదును నిశితంగా పరిశీలించాలన్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌లపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ సుబ్బులక్ష్మి, డిప్యూటి తహసీల్దార్ మధుబాబు పాల్గొన్నారు.
ఉపాధి పనులపై అవగాహన
యాదమరి : మండలంలోని 14 కండ్రిగలో గ్రామస్తులు, రైతులకు ఉపాధి పనులపై శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు రాజశేఖర్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ కార్డులు ఉన్నవారందరూ పని చేసుకోవాలని కోరారు. ఉపాధి కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం రైతులు తమ పొలాల్లో నూతనంగా తవ్విన ఫారంఫాండ్‌లను పరిశీలించారు. ఫాండ్ వల్ల వర్షపు నీరు నిల్వ చేరి వ్యవసాయబోర్లకు ఉపయోగపడుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఓ బాల, ఈసీ రమ్య పాల్గొన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న రాజశేఖర్