
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం : బడుగుల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. శనివారం పుత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబు చివరకు రోగాల పేరు చెప్పి బయటపడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాలో ఎంతగా అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, అభివృద్ధిని చూసే ఓట్లు వేస్తారని వెల్లడించారు. అంబేడ్కర్ భావజాలం ఉన్నవారు చంద్రబాబుకు ఎప్పటికీ అండగా ఉండరని తెలిపారు. జగనన్న పేదల పక్షాన నిలబడితే, చంద్రబాబు పెత్తందార్లు వైపు ఉన్నారని విమర్శించారు. జగనన్నకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు.