ఆగని గజ దాడులు

మాట్లాడుతున్న ఎంపీడీఓ గౌరి  
 - Sakshi

ఐరాల: మండలంలోని చుక్కావారిపల్లె మా మిడి తోటల్లోకి ఏనుగుల గుంపు పదే పదే చొరబడుతూ పంటలకు తీవ్రంగా నష్టం కలి గిస్తున్నాయి. గురువారం రాత్రి గ్రామానికి చెందిన రైతు రఘనాథ్‌రెడ్డి మామిడి తోటపై ఏ నుగులు విరుచుకుపడ్డాయి. మామిడి చెట్ల కొ మ్మలను విరిచేశాయి. సుమారు రెండు టన్నుల కాయలను తిని, తొక్కి విధ్వంసం సృష్టించా యి. తోటలో ఉన్న గుడిసెను ధ్వంసం చేసి, నిత్యావసర సామగ్రిని నాశనం చేశాయి. తోటలో ఉంచిన బాలాజీ స్కూటీని రోడ్డుపై ప డేసి, తొక్కి ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడి లో సుమారు రూ.లక్ష నష్టం వాటిలినట్లు బాధిత రైతు తెలిపారు.

బడి ఈడు పిల్లలు బడిలోనే..

పూతలపట్టు: బడిఈడు పిల్లలు పనిలో కాకుండా బడిలో ఉండాలని జిల్లా సహాయ కార్మిక అధికారి జగదీశ్‌బాబు అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా శుక్రవారం పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దుకాణాలు, ఇటుకబట్టీలు, మెకానిక్‌ షాపుల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి చదువుపై అవగాహన కల్పించాలని మహిళా పోలీసులకు ఆదేశించారు. ఎంపీడీఓ గౌరి మా ట్లాడుతూ మండల పరిధిలోని బాల కార్మికులను గుర్తించి ఈనెల 12న ప్రపంచ బాలకార్మికుల నిర్మూలన దినోత్సవం రోజున బడికి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కొందరు తల్లిదండ్రులు ఇవి తెలుసుకోలేక పిల్లలను పనులకు పంపుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా కానుక, అ మ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్‌ విజయభాస్కర్‌, శివశంకర్‌, మురళి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జిల్లాకు రాక

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శనివారం చిత్తూరు జిల్లాకు విచ్చేయనున్నారు. ఈమేర కు శుక్రవారం కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు ఆర్థిక శాఖ మంత్రి ఈనెల 3 న ఉదయం 11.45 గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం చిత్తూరు నుంచి బయలుదేరి తిరుపతి జిల్లాకు వెళ్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గాలీవానకు నేలకూలిన

70 విద్యుత్‌ స్తంభాలు

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో చిత్తూరు అ ర్బన్‌ డివిజన్‌ పరిధి లో గురువారం రాత్రి కురిసిన గాలీవానకు 70 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఈఈ పద్మనాభపిళ్లై తెలిపారు. చిత్తూ రు నియోజకవర్గంతో పాటు ఆవులకొండ, పెనుమూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, పాలసముద్రం మండలాల్లో మొత్తం 70 విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 16 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. డీఈ, ఏఈ, సిబ్బంది సంరక్షణ పనులు చేస్తున్నారని వివరించారు.

బదిలీలకు దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీసీ వెంకటరమణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా రు. శాఖాపరమైన చర్యలు, పాలనాపరంగా బ దిలీ అయిన వారు అనర్హులని తెలిపారు. అలాంటి వారు ఎస్‌వోల కవరింగ్‌ లెటర్లను ఈ నెల 7 లోపు డీఈవో కార్యాలయంలో అందజేయాలని ఏపీసీ తెలిపారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top