● పగలే 9 గంటల విద్యుత్‌ : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ● పండుగలా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభం ● జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి ● రూ.4.17 కోట్ల రాయితీతో 237 సంఘాలకు 111 ట్రాక్టర్లు పంపిణీ ● ఆనందోత్సాహంలో లబ్ధిదారులు

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో అందజేసిన ట్రాక్టర్లు - Sakshi

సాక్షి, చిత్తూరు: OÆð‡™èl$ÌS A¿¶æ$Å-¯]l²™ól «§ólÅĶæ$…V> ™èlÐ]l$ {糿¶æ$™èlÓ… ç³°^ól-Ýù¢…§ýl° Ð]l$…{† ò³¨ªÆð‡yìlz ™ðlÍ-´ëÆý‡$. OÆð‡™èl$-ÌSMýS$ Ð]lÅÐ]lÝë-Ķæ*-°MìS ç³VýSsìæ ç³Nsôæ 9 VýS…rË$ ѧýl$Å™Œæ CçÜ$¢-¯]l²r$Ï õ³ÆöP-¯é²Æý‡$. Ô¶æ${MýS-Ðé Æý‡… E§ýlĶæ$… Ð]l¬QÅ-Ð]l$…{† OÐðlG‹Ü fVýS-¯ŒS-Ððl*çß毌S-Æð‡yìlz VýS$…r*-Æý‡$ÌZ OÐðlGÝëÞÆŠ‡ Ķæ$…{™èl õÜÐé ç³£ýlMýS… Ðól$âê {´ëÆý‡…-À…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]lÆý‡$a-Ð]lÌŒæ Ñ«§é-¯]l…ÌZ Ý린MýS ï³ÒMóS-ె {糿¶æ$™èlÓ yìl{X MýSâê -Ô>ÌS OÐðl$§é-¯]l…ÌZ hÌêÏ-Ýë¦Æ‡$$ M>Æý‡Å{MýS-Ð]l*°² Ð]l$…{† {´ëÆý‡…-À…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> OÆð‡™èl$-ÌS™ø fÇW¯]l çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ Ð]l*sêÏyéÆý‡$. Æ>çÙ‰ ÐéÅç³¢…V> 2551 {sêMýStÆý‡$Ï, 100 àÆð‡Ó-çÜtÆý‡$Ï ç³…í³×îæ ^ólĶæ$V>, _™èl*¢Æý‡$ hÌêÏÌZ 237 {VýS*ç³#-ÌSMýS$ Æý‡*. 4.17 MørÏ Æ>Ƈ$$¡™ø 111 {sêMýStÆý‡$ϯ]l$ ç³…í³×îæ ^ólçÜ-¯]lr$Ï ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l¬QÅÐ]l$…{† OÐðlG‹Ü fVýS¯ŒS-Ððl*-çß毌S-Æð‡yìlz OÆð‡™èl$ 糄ýS´ë† A° çܵçÙt… ^ólÔ>Æý‡$. C™èlÆý‡ Æ>[Úët-ÌS™ø ´ùÍõÜ¢ Hï³ÌZ A«¨-MýS…V> Ð]lÅÐ]lÝëĶæ$ Æý‡…VýS…Oò³ B«§éÆý‡ ç³yìl E¯é²Æý‡-¯é²Æý‡$. ç³…r-ÌSMýS$ Wr$t-»êr$ MýSÍ-µ…^ól…-§ýl$MýS$ «§ýlÆý‡ÌS íܦÈ-MýS-Æý‡×æ °«¨° MýS*yé HÆ>µr$ ^ólíܯ]l çœ$¯]l™èl ïÜG… fVýS-¯ŒSÐðl*-çß毌S-Æð‡-yìlzMóS §ýlMýS$P-™èl$…§ýl° ÑÐ]l-Ç…^éÆý‡$.

రెండు నెలల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను రెండు నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నీటితో నింపుతామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పడమటి ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నా రు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లను అర్హులైన వారికి మంజూరు చేశామన్నారు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందజేస్తోందని పేర్కొన్నారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ గ్రూపులకు రాయితీపై ట్రాక్టర్లు పంపిణీ చేశామన్నారు

పండుగలా వ్యవసాయం

జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడు తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి న తర్వాత రైతులకు వ్యవసాయం పండుగలా మా రిందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తోందని, ఆర్‌బీకేల ద్వారా రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతుల అభ్యున్నతే ధ్యేయం

ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, సాగు,తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. డీసీసీబీ చైర్మన్‌ రెడ్డెమ్మ మాట్లాడుతూ ఆర్‌బీకేలతో రైతు ముంగిటకే అన్ని సమకూరుతున్నాయన్నారు. వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యంత్ర సేవ పథకంలో ట్రాక్టర్లు అందజేయడంతోపాటు ఖరీఫ్‌ సీజన్‌కు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మ న్‌ బుల్లెట్‌ సురేష్‌, పాల ఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌ మురళీ, చిత్తూరు నగర మేయర్‌ అముద, డీసీసీబీ చైర్మన్‌ రెడ్డెమ్మ, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డి, ఐసీడీఎస్‌ రాయలసీమ జోనల్‌ చైర్మన్‌ శైలజా రెడ్డి, పలమనేరు– కుప్పం– మదనపల్లె అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి యాదవ్‌, జెడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్మన్‌ భారతి, డీఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ట, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీఓ రేణుక పాల్గొన్నారు.

రైతు పక్షపాత ప్రభుత్వం

కష్టం తీర్చిన ప్రభుత్వం

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్‌, గడ్డి కట్టే యంత్రం, స్ప్రేయర్స్‌, రోటో వేటర్స్‌ పరికరాలను సబ్సిడీతో పొందాం. మా గ్రామంలో సుమారు 2 వేల ఎక రాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. ఈ సీజన్లో గడ్డి కట్టే యంత్రం బాగా ఉపయోగపడింది. కూలీల ద్వారా గడ్డి కట్టలు కట్టాలంటే రూ.2 వేలు ఖర్చు అయ్యేది. ఈ మిషన్‌ ద్వారా రూ.800లే ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతుల కష్టాలు తీరుస్తోంది

–ఎన్‌.శంకర్‌ రెడ్డి,గంగినాయనపల్లె(బైరెడ్డిపల్లె)

జగనన్నకు రుణపడి ఉంటాం

ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ అవసరం లేకుండా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సబ్సిడీతో అందజేయడం ఆనందంగా ఉంది. రూ.7 లక్షల 66 వేల,633 విలువచేసే ట్రాక్టర్‌ను రూ.3 లక్షల 6 వేలకే పొందాం. కల్టివేటర్సు, రోటవేటర్స్‌, స్ప్రేయర్స్‌, బేడ్లు మొదలైన పరికరాలన్నీ రూ 5.5 లక్షలకు అందుకున్నాం. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – పి.గిరిబాబు, వెంకటాపురం

(ఎస్సాఆర్‌పురం), వైఎస్సార్‌ రైతు మిత్ర గ్రూపు

లాభసాటిగా వ్యవసాయం

మా గ్రూపు సభ్యులందరం యంత్ర సేవా పథకం కింద లబ్ధి పొంది లాభసాటిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. రూ.8 లక్షల 55 వేల ట్రాక్టర్‌ను రూ. 3లక్షల 22 వేలతో, రోటవేటర్స్‌, స్ప్రేయర్స్‌ వంటి పరికరాలను సబ్సిడీతో రైతు పొందాం. సామాన్య రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా యంత్రపరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు. ఆయన వెంటే ఉంటాం.

– జీవీ.దేవేంద్రరెడ్డి,టి.గడ్డూరు(బైరెడ్డిపల్లె)

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top