
మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్
చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం వీడికో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో పది పరీక్షలకు చేసిన ఏర్పాట్లను జేసీ వెంకటేశ్వర్ వివరించారు. మొత్తం 115 కేంద్రాల్లో 21.996 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. 11 రూట్‌లకు గాను 22మంది అధికారులను నియమించామన్నారు. ఆరు బృందాలతో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఓపెన్ స్కూల్‌కు సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షలను మొత్తం 4,659 మంది అభ్యర్థులు రాయనున్నట్లు వివరించారు. వీరి కోసం సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాల తరలింపునకు తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ రాజశేఖర్, డీఈఓ విజయేంద్రరావు పాల్గొన్నారు.