
ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది.. రసాయన రహిత ఆహార ఉత్పత్తులపై అవగాహన వచ్చింది. సేంద్రియ పంటల కొనుగోలుపై ఆసక్తి అధికమైంది.. అయితే ప్రకృతి విధానంలో సాగుచేసిన కూరగాయలు ఎక్కడ లభిస్తాయి..? క్రిమిసంహారకాలు వాడని ఆకు కూరలు ఎక్కడ దొరుకుతాయి..? పురుగు మందుల అవశేషాలు లేని తీగజాతి కాయకూరలు ఎక్కడ లభిస్తాయి..? ఇలాంటి ప్రశ్నలకు ఓ స్వచ్ఛంద సంస్థ సమాధానం ఇస్తోంది. ఇటు రైతుకు గిట్టుబాటు దక్కేలా.. అటు కొనుగోలుదారుడికి సంతృప్తి కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. ఇరువురి భాగస్వామ్యంతో చిన్న కమతాల్లో గోఆధారిత సేద్యానికి బాటలు వేసింది. దళారీలతో పనిలేకుండా అన్నదాత – వినియోగదారుడు నేరుగా ఒప్పందం కుదుర్చుకుని లబ్ధి పొందేలా ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసింది. తిరుపతి సమీపంలోని వేమూరు గ్రామంలో సాగుతున్న విశేష వ్యవసాయాన్ని పరిశీలించేందుకు ‘సాక్షి’ పొలంబాట పట్టింది. సమగ్ర సమాచారంతో
ప్రత్యేక కథనం అందిస్తోంది.