
రాజును సత్కరిస్తున్న వీసీలు కిషన్‌రావు, రవీందర్
పుత్తూరు రూరల్: తిరుపతికి చెందిన ప్రముఖ రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘బులుసు బుచ్చి సర్వారాయుడు స్మారక కీర్తి పురస్కారం’ అందించింది. మంగళవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో హాస్య కథా రచన విభాగంలో విశిష్ట సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య తంగేడు కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్సలర్ డి.రవీందర్ పాల్గొన్నారు.