
మాట్లాడుతున్న చంద్రశేఖర్
చిత్తూరు కలెక్టరేట్ : క్రీడా సంఘాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, తైక్వాండో అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరులో ఏపీ తైక్వాండో సంఘం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
రోడ్డుప్రమాదంలో
ఉపాధ్యాయుడు మృతి
ఐరాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని మంగళవారం రాత్రి ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మద్దిపట్లపల్లె సమీపంలో చోటుచేసుకుంది. కాణిపాకం ఏఎస్‌ఐ ఆర్ముగం కథనం మేరకు.. తవణంపల్లె మండలం పల్లెచెరువుకు చెందిన ఉపాధ్యాయుడు గోపినాథ్‌రెడ్డి(55). ఇతను కొత్తగొల్లపల్లెలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ఐరాల మండలం పెండ్లిగుండపల్లెలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి చిత్తూరు నుంచి బైక్‌లో పెండ్లిగుండ్లపల్లెకు వెళుతుండగా మద్దిపట్లపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపినాథ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ చెప్పారు