
పంట పొలంలో కల్పన
చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, బెస్తపల్లెకు చెందిన కల్పన ఎంకాం, బీఈడీ, డీఈడీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. నేచురల్ ఫామింగ్‌లో చేరారు. అక్కడ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకుంటున్నారు. తాను నేర్చుకున్న విద్యను ఆచరణలో చూపాలనుకుని.. ఏడాది క్రితం గ్రామంలోనే అర ఎకరా లీజుకు తీసుకుని సాగుచేయడం ప్రారంభించారు. అందులో నవధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, మిరప, వంగ, ఉల్లి, మునగ, టమాట, కొత్తిమీర, వివిధ రకరకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. చిన్నాన్న కేశవులు సాయంతో పండించిన కూరగాయాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు.
నేచురల్‌గా ముందుకు సాగాలని..

కల్పన