స్తంభించిన యూట్యూబ్‌.. కంటెంట్‌ క్రియేటర్ల గగ్గోలు!

YouTube down for some time What went wrong - Sakshi

కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ చుక్కలు

అప్‌లోడ్‌ చేసినా కనిపించని వీడియోలు

లైవ్‌ ఛానళ్లకు ఇక్కట్లు

కొత్త వీడియోలు కనిపించక యూజర్ల ఆందోళన

బగ్‌ ఎక్కడ వచ్చిందని పరిశీలిస్తోన్న యూట్యూబ్‌

ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్‌ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్‌ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్‌సైట్‌లు, సర్వీస్‌ స్టేటస్‌ గురించి యూజర్లకు రియల్‌ టైమ్‌ సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్‌లోడ్‌ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు.

ఏం జరిగిందంటే..
డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా  ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్‌ ఛానళ్ల నుంచి ఫీడ్‌/ వీడియోలు/ లైవ్‌ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్‌కు సర్వీస్‌ రిక్వెస్ట్‌లు పంపించారు. వర్కింగ్‌ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్‌ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్‌ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి.

whatsapp channel

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top