వ్యాక్సిన్‌ వేయించుకోవాలా? ఉబెర్‌ ఆఫర్‌ 

 Uber Announces Free Rides For Passengers to And From COVID-19 Vaccination Centres - Sakshi

 వ్యాక్సినేషన్‌కోసం వెళ్లే  యూజర్లకు ఉచిత రైడ్‌

ఉబెర్ గో, ఉబెర్‌ గో సెడాన్, ఉబెర్ ప్రీమియంలో రూ.300 వరకు ఫ్రీ

సాక్షి, ముంబై:  కరోనా సంక్షోభ సమయంలో క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు  ఉచిత రైడ్లను అందిస్తున్నట్లు ఉబెర్  మంగళవారం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి టీకా కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది.  రైడర్స్ టీకా కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ .300 విలువైన రైడ్‌లు (వె​ళ్లడానికి రూ. 150, రావడానికి రూ. 150 వరకు) పొందవచ్చని ఉబెర్ తెలిపింది. ఈ మేరకు అర్హులైన తన వినియోగదారులకు ఈమెయిల్‌ సమాచారాన్నికూడా అందించింది.  (ఫైజర్‌ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం)

ఈ ఉచిత రైడ్ ఉబెర్ గో, ఉబెర్‌ గో సెడాన్, ఉబెర్ ప్రీమియర్లలో మాత్రమే చెల్లుతుందని ఉబెర్‌ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టీకా కేంద్రాల జాబితాను విడుదల చేసింది. అలాగే ఈ ఫ్రీ రైడ్‌ను వినియోగించుకునేందుకు యూజర్లకు యాప్‌ ఒక  ప్రోమోకోడ్‌ను అందిస్తుంది. సర్వీస్ పనిచేసే 36 నగరాల్లోని అన్ని టీకా కేంద్రాలను పేర్కొంది.

 ఎలా వినియోగించుకోవాలి
యాప్‌ ఓ పెన్‌ చేసిన తరువాత  ఎగువ ఎడమ మూలలో మెనూని క్లిక్‌ చేసి “వాలెట్”  సెలెక్ట్‌ చేసి ఉచిత ప్రయాణానికి యూజర్లు ప్రోమో కోడ్ (10ఎం21వి) ని ఎంచుకోవాలి. ఆ తరువాత సమీప టీకా కేంద్రానికి పిక్-అప్ లేదా డ్రాప్‌ వివరాలను ఎంటర్‌ చేసి, నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఉబెర్‌ తన యాప్‌ ద్వారా దగ్గరలోని అధీకృత  టీకా  కేంద్రాల సమాచారాన్ని కూడా అందిస్తుంది.  కాగా  మూడో దశ వ్యాక్సినేషన్‌లో  భాగంగా మే 1 నుంచి  దేశంలో 18నుంచి 45 సంవత్సరాలు పైబడినవారికి  కరోనా వ్యాక్సిన్‌ అందివ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top