
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేస్తున్నాయి. మంగళవారం ఉదయం 9.34గంటల సమయానికి సెన్సెక్స్ రికార్డ్ స్థాయిలో 203పాయింట్లు లాభంతో 58,384 వద్ద ట‍్రేడ్ అవుతండగా నిఫ్టీ సైతం 63.70 పాయింట్ల లాభంతో 17,436 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది.
జీనెట్, డిష్‌టీవీ ఇండియా, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ఎస్ బ్యాంక్,నారాయణ్ హృదయ్,అమి ఆర్గానిక్స్, విజయ లిస్టింగ్స్ షేర్లు లాభాల్లో ఉండగా..ఐడీఎఫ్‌సీ,క్యాప్‌లిన్ పాయింట్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ లాంబార్డ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.