కనక వర్షం కురిపిస్తున్న ఆ టాటా కంపెనీ షేర్లు..!

Tata Elxsi Hits Record High For Second Straight Day, Zooms 8 Per cent To 52 Week High - Sakshi

స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్‌ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో చెప్పినట్టు ఒక్క ఏడాదిలో కోటీశ్వరుడు కావడానికి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. అయితే, ఇందులో ఏదైనా తేడా జరిగిన కూడా బికారి అవ్వడం కూడా ఖాయం. ఇది అలా ఉంటే.. ఒక కంపెనీ షేర్లు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. వాళ్లు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపెడుతుంది. 

ఆ కంపెనీ పేరు వచ్చేసి టాటా ఎలెక్సి లిమిటెడ్(Tata Elxsi stock). ఈ కంపెనీ షేరు ధర నేడు బీఎస్ఈలో 7.55 శాతం పెరిగి రూ.9,078 వద్ద తాజా గరిష్టాన్ని తాకింది. గత రెండు రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్ 17.18 శాతం లాభపడింది. కేవలం ఇవ్వాళ ఒక్కరోజే ఈ షేర్ విలువ రూ.571 పైగా లాభపడింది. టాటా ఎలెక్సి నేడు రూ.9,010 వద్ద ఉంది. అయితే, కరోనా వచ్చిన ఏడాది మార్చి నెలలో దీని స్టాక్ ధర మీరు షాక్ అవ్వాల్సిందే. 2020 మార్చి 27 తేదీన దీని ధర అప్పుడు రూ.639.10లుగా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ షేర్ విలువ 14 రేట్లకు పైగా పెరగడం విశేషం. అంటే.. 2020 మార్చిలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.14 లక్షలుగా మారనుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు విలువ 52.19 శాతం లాభపడగా, ఏడాదిలో 237.07 శాతం పెరిగింది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55,812 కోట్లకు పెరిగింది.
 

(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న గృహ ధరలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top