ఫెడ్‌ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు | stock market updates on January 30 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: ఫెడ్‌ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Jan 30 2025 9:49 AM | Updated on Jan 30 2025 9:53 AM

stock market updates on January 30 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76.56 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.51 శాతం దిగజారింది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్‌ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్‌లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement