హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రాభమై.. నేటితో (నవంబర్ 3)న ముగిసింది. బిడ్డింగ్ చివరి రోజు (సోమవారం) కంపెనీ బలమైన పెట్టుబడిదారుల ఆసక్తిని సంపాదించింది.
ప్రారంభ వాటా అమ్మకం బిడ్డింగ్ మూడవ రోజున 73.25 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. సంస్థాగతేతర పెట్టుబడిదారుల నుంచి 77 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగా, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 23 రెట్లు సబ్‌స్క్రయిబ్ పొందింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోటా 160 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. అంతకుముందు, కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.137 కోట్లు సేకరించింది.
స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ ప్రారంభం కావడానికి ముందే.. ఒక్కో షేరుకు రూ.557-585 ధరల శ్రేణిని నిర్ణయించింది, దీని విలువ దాదాపు రూ.2,300 కోట్లుగా ఉంది. కాగా స్టడ్స్ యాక్సెసరీస్ షేర్లు నవంబర్ 7న ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడతాయి, అయితే కేటాయింపు నవంబర్ 4 నాటికి జరుగుతుందని సమాచారం.


