నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు | Startups are the backbone of new India Piyush Goyal | Sakshi
Sakshi News home page

నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు

Feb 28 2024 7:23 AM | Updated on Feb 28 2024 1:25 PM

Startups are the backbone of new India Piyush Goyal - Sakshi

న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. 2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్‌లకు సూచించారు.

స్టార్టప్‌ మహాకుంభ్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్‌ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్‌ దర్పణంగా నిలుస్తుందని గోయల్‌ చెప్పారు.

దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్‌ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్‌ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement