Share Pledging Case: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట! 

Share Pledging Case: A big relief to Kotak Mahindra Bank Tribunal Dismisses Orders - Sakshi

న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్‌ బ్రోకర్లకు సంబంధించిన షేర్‌ తనఖా కేసులో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్‌ ఎక్స్చేంజ్ ఎన్‌ఎస్‌ఈ డిపాజిటరీ సీడీఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీస్‌ లిమిటెడ్‌–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్‌-ట్రేడింగ్‌ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్‌ఎస్‌ఈ, సీడీఎస్‌ఎల్‌కు ఉండబోవని అప్పీలేట్‌ అథారిటీ స్పష్టం చేసింది.  (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్‌ ధర కేవలం రూ. 2480)

కేసు వివరాలు ఇవీ... 
మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నుంచి రుణాన్ని పొందింది.   తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం  పొందిన  యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్‌ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే  డిసెంబర్‌ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్‌ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్‌ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్‌ఎస్‌ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్‌ అకౌంట్‌ను సీడీఎస్‌ఎల్‌ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్‌ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను కోటక్‌ బ్యాంక్‌ ఆశ్రయించింది.  (Vivo Y35: స్లిమ్‌ ఫోన్‌ ‘వై35’  ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?)

రూలింగ్‌ ఇలా... 
స్టాక్‌ ఎక్స్చేంజ్‌గా ప్రతివాది (ఎన్‌ఎస్‌ఈ) దాని ట్రేడింగ్‌ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్‌ స్పష్టం చేసింది. ట్రేడింగ్‌ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని,  లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top