అదృష్టం అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది..! లక్ష పెట్టుబడి..లాభం రూ.20 లక్షలు..!

Rs 1 Lakh Radhe Developers Stock Turned Into Rs 20.04 Lakh Today - Sakshi

అదృష్టం అడ్రస్‌ వెతుక్కుంటూ రావడం' అంటే ఇదేనేమో..! కరోనా వేరియంట్‌తో  దేశీయ మార్కెట్‌లో లక్షల కోట్లు బూడిదపాలవుతుంటే..అదే మార్కెట్‌లో మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌ మాత్రం కనకవర్షం కురిపిస్తున్నాయి.    

మల్టీ బ్యాగర్‌లో పెన్నీస్టాక్స్‌ 'రాధే డెవలపర్స్‌' కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు వరంగా మారింది. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్‌పై 1,904శాతం రాబడితో ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్‌ 26,2021న ఈ స్టాక్ వ్యాల్యూ రూ.17.07 ఉండగా.. నవంబర్‌ 26 నాటికి రూ.342.30కి పెరిగింది. దీంతో మూడు నెలల క్రితం ఈ స్టాక్స్‌ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.20.04 లక్షలు సంపాదించారు. 

లక్షల కోట్లు ఆవిరి కానీ 
కరోనా వేరియంట్‌ కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. అదే సమయంలో శుక్రవారం రోజు రాధే డెవలపర్స్ షేర్లు గురువారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి రూ.325.95తో పోలిస్తే 4.99% పెరిగి శుక్రవారం రోజు  రూ.342.2 ఆల్ టైమ్ హైని తాకాయి.  

స్టాక్ పనితీరు
బిఎస్‌ఈలో రాధే డెవలపర్స్ స్టాక్స్‌ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.861.66 కోట్లకు పెరిగింది. మొత్తం 1.30 లక్షల షేర్లు రూ.4.44 కోట్ల టర్నోవర్‌తో చేతులు మారాయి. పనితీరు  5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ఉంది. షేర్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 3,603% లాభపడింది. ఒక సంవత్సరంలో వ్యాల్యూ 3,540% పెరిగడంపై ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top