ఆర్ధిక మాద్యం దెబ్బకు మరో సంస్థ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ రాబిన్ హుడ్ 23 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు 23శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపగా.. మూడునెలల ముందు 9శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించింది
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాద్యంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేడయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ కంపెనీ రాబిన్ హుడ్ 713 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 2,400మంది ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు ట్రెక్ క్రంచ్ నివేదించింది.
ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సీఈవో అండ్ కో-ఫౌండర్ వ్లాడ్ టెనెవ్ మాట్లాడుతూ..కంపెనీ పునర్నిర్మించాలని భావిస్తున్నాం. అందుకే మా వర్క్ ఫోర్స్‌ను సుమారు 23 శాతం తగ్గించుకుంటున్నాం. తద్వారా సంస్థ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకుంటాం. వారితో కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తాం. ఆ బాధ్యత తనపై ఉంటుందని వ్యాఖ్యానించారు.
క్యూ2 ఎఫెక్ట్
ఇటీవల ఫిన్‌టెక్ సంస్థ రాబిన్ హుడ్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నెట్ రెవెన్యూ 318 మిలియన్ డాలర్లు ఉండగా 295 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నియమాల్ని రాబిన్ హుడ్ ఉల్లంఘించిందంటూ న్యూయార్క్ ఫైనాన్షియల్ రెగ్యులరేటర్ 30మిలియన‍్ల ఫైన్ విధించింది. వెరసీ ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే సంస్థ సీఈవో వ్లాడ్ టెనెవ్ ఉద్యోగుల్ని తొలగించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment