కరోనా ఎఫెక్ట్‌.. హాట్‌కేక్‌లా సేల్స్‌, కోట్లు పెట్టి ఆ ఇళ్లనే కొంటున్న జనం!

Real Estate Buying Keen 65pc On Hni, Uhni Says India Sotheby's International Realty - Sakshi

స్థిరాస్తిలో పెట్టుబడులకు హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐ ఆసక్తి 

65% మంది రూ. 4–10 కోట్ల ప్రాపర్టీలకు..

13 శాతం మంది అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలకే మొగ్గు

ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు హాట్‌స్పాట్స్‌ 

ఇండియా సోత్‌బైస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ వార్షిక సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరిగింది. 65 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న

లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గుచూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తుల కోసం ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ (ఐఎస్‌ఐఆర్‌) వార్షిక సర్వే వెల్లడించింది. 

కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్‌ ఎస్టేట్‌ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. 61 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ,

యూహెచ్‌ఎన్‌ఐలు 2023–24లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్‌ అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు. 

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 34 శాతం మంది హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలా మంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. గత 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. అయి తే 2015లోని గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గుచూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధామ్యాలు మెరుగైన ఫిజికల్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలకే.

ఈ నగరాలే హాట్‌స్పాట్స్‌.. 
సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవ నశైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్‌ఎన్‌ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11% మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీ లకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, లండన్, దుబాయ్, లిస్బన్‌ దేశాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్‌ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top