పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయా? | Is RBI planning to scrap old Rs 100 notes | Sakshi
Sakshi News home page

పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయా?

Dec 29 2023 9:32 PM | Updated on Dec 29 2023 9:40 PM

Is RBI planning to scrap old Rs 100 notes - Sakshi

పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ  నోట్లు రద్దవుతాయంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు. పాత రూ.100 నోటు ఇస్తే తీసుకోవడం లేదంటూ మరికొందరు పోస్టు చేస్తున్నారు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో ఓ యూజర్‌ పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయని, 2024 మార్చి 31 వరకు పాత రూ.100 నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించిందని పోస్ట్‌ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా దుకాణదారులు పాత రూ.100 నోటు తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన మరో యూజర్‌ పేర్కొన్నారు. ఈ పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్‌బీఐని ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించారు. 

అయితే పాత వంద రూపాయల నోట్లు నిజంగానే రద్దవుతున్నాయా.. ఆర్‌బీఐ అలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చిందా అని పరిశీలించగా ఇవన్నీ ఫేక్‌ వార్తలని తేలింది. ఇందులో వాస్తవం లేదని ఆర్‌బీఐ ప్రతినిధి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement