పేటీఎం, ఫాస్టాగ్‌పై ఆందోళనలు.. ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం!

Rbi Meets Nhai,Npci For Rescue Paytm Users - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్‌ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ), కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.   

ఇక ఈ భేటీలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్‌ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్‌బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. 

పేటీఎంపై ఆర్‌బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్‌ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్‌బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్‌బీఐ వచ్చే వారం ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

టోల్‌ చెల్లింపుల కోసం ఫాస్టాగ్‌
మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్‌ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్‌ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్‌ బ్యాంక్‌ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్‌ యూజర్లు.. టోల్‌ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top