ప్రైమ్‌బుక్‌ చవక ల్యాప్‌టాప్‌

Primebook 4G Set to Launch Exclusively on Flipkart - Sakshi

ధర రూ.16,990 నుంచి విక్రయించనున్న ఫ్లిప్‌కార్ట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా విద్యార్థుల కోసం ప్రైమ్‌బుక్‌ 4జీ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఆన్‌డ్రాయిడ్‌–11 ఆధారిత ప్రైమ్‌ఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్‌ ఎంటీకే8788 ప్రాసెసర్, 11.6 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, వైఫై, బ్లూటూత్, 4జీ సిమ్‌ స్లాట్, ఫుల్‌ హెచ్‌డీ 2 ఎంపీ కెమెరా ఏర్పాటు ఉంది. బరువు 1.065 కిలోలు. ఒక ఏడాది ఆన్‌సైట్‌ వారంటీ ఉంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ పొందుపరిచారు. 10 గంటలకుపైగా బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది.

200 జీబీ వరకు మెమరీ ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు. బ్యాంక్, స్టూడెంట్‌ ఆఫర్స్, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఆరు నెలల ఉచిత చందా, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆఫర్లతో రూ.11,827 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి 4జీబీ/64 జీబీ రూ. 16,990, అలాగే 4జీబీ/128 జీబీ రూ.18,990 ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ దేశీయంగా తయారైంది. విద్యార్థుల కోసం ఉద్ధేశించిన ల్యాప్‌టాప్స్‌ విక్రయా లు తమ వేదికపై గడిచిన మూడేళ్లలో 1.5 రెట్లు పెరిగాయని ఫ్లిప్‌కార్ట్‌ లార్జ్‌ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరి కుమార్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top