
న్యూఢిల్లీ: డెకాకర్న్ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ నుంచి 10 కోట్ల డాలర్లను(రూ. 820 కోట్లు) సమీకరించింది. ఇప్పటికే ప్రారంభించిన బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ప్రస్తుత పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీ 12 బిలియ న్ డాలర్ల విలువలో నిధుల సమీకరణకు తెరతీసింది.
దీనిలో భాగంగా రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఇప్పటివరకూ 75 కోట్ల డాలర్ల పెట్టుబడులను అందుకుంది. జనరల్ అట్లాంటిక్ 2023 జనవరిలో 35 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! వాల్‌మార్ట్ 20 కోట్ల డాలర్లు, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ 10 కోట్ల డాలర్లు చొప్పున ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేశాయి.