పేటీఎం రూపే క్రెడిట్‌ కార్డ్‌ వచ్చేసిందిగా! కార్డు లేకుండానే..

Paytm Payments Bank introduces RuPay Credit Card on UPI - Sakshi

ముంబై: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత ‘రూపే క్రెడిట్‌ కార్డ్‌’ను విడుదల చేసింది. కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్‌ కార్డ్‌ను లింక్‌ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. రూపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఏర్పడుతుందని తెలిపింది. వినియోగదారులకు ఉత్తమ సదుపాయాలను అందించాలన్న లక్ష్యంలో భాగమే రూపే క్రెడిట్‌ కార్డ్‌ అని కంపెనీ అభివర్ణించింది.

(ఇదీ చదండి : RBI Policy review: రెపో రేటు పెంపు)

రూపే క్రెడిట్‌ కార్డ్‌   లింక్‌ చేసుకున్న యూపీఐ ఐడీ ద్వారా  లావాదేవీలు సజావుగా, ఆఫ్‌లైన్ , ఆన్‌లైన్ చెల్లింపులు రెండూ వేగంగా మారుతాయని కంపెనీ వెల్లడించింది.  తమ కస్టమర్లకు చెల్లింపులను మరింత సులభం చేసేలా ఎన్‌పీసీఐ  భాగస్వామ్యంతో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్  సేవలు ప్రారంభించామని పేమెంట్స్‌   బ్యాంక్  సీఎండీ సురీందర్ చావ్లా తెలిపారు. (ఐకియా గుడ్‌న్యూస్‌: ధరలు తగ్గాయోచ్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top