అదానీ పవర్ యూనిట్‌కు నష్టపరిహారం చెల్లించండి: సుప్రీం కోర్టు

Pay Compensatory Dues To Adani Power in 4 weeks: Supreme Court - Sakshi

దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ పవర్ యూనిట్‌కు అనుకూలంగా భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న పంపిణీ సంస్థలు అదానీ పవర్ లిమిటెడ్‌కు 3000 కోట్ల రూపాయలు(405 మిలియన్ డాలర్లు), ఇంధన ఖర్చుల కోసం అదనపు వడ్డీని చెల్లించాల్సి ఉందని కోర్టు తెలిపింది. అదానీ పవర్ గ్రూప్ గత కొన్నేళ్లుగా రాజస్థాన్, హర్యానాతో సహా ఇతర రాష్ట్రాలకు వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తోంది. పవర్ ప్లాంట్ల కోసం వినియోగించే దిగుమతి చేసుకున్న బొగ్గుకు సంబంధించిన ఖర్చులకు నష్టపరిహారం చెల్లించాలని అదానీ పవర్ కోరుతోంది. 

దీంతో, 2013 నుండి చెల్లించాల్సిన చెల్లింపులను నాలుగు పంపిణీ సంస్థలు అదానీ పవర్ యూనిట్‌కు నాలుగు వారాల్లోగా డబ్బు చెల్లించాలని భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాత కేబుల్ నెట్ వర్క్ వల్ల విద్యుత్ దొంగతనాలు, లీకేజీల కారణంగా సరఫరా చేసే విద్యుత్ లో దాదాపు ఐదో వంతు నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు పవర్ ఉత్పత్తి చేసే సంస్థలకు బిలియన్ డాలర్ల చెల్లింపులు రుణపడి ఉన్నాయి. తాజా తీర్పు వల్ల అదానీ పవర్ తన రుణాలను తిరిగి చెల్లించడానికి లేదా ప్రాజెక్టుల మూలధన అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ తీర్పుతో అదానీ పవర్ షేర్లు 15% వరకు పెరిగాయి.

(చదవండి: మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top