భారత్‌లో ఒరాకిల్‌ 12,000 మందికి ఉద్వాసన | Oracle Lays Off 12000 Employees In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఒరాకిల్‌ 12,000 మందికి ఉద్వాసన

Apr 1 2026 3:14 AM | Updated on Apr 1 2026 7:38 AM

Oracle Lays Off 12000 Employees In India

ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాల కోత 

న్యూఢిల్లీ: యూఎస్‌ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.

అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్‌ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్‌ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్‌ ఎన్‌క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్‌ చేస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement