ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ కొత్త బైక్‌.. రూ.లక్షకే ఆఫర్‌! | Oben Electric Launches Roar Ez at Introductory Price of 99999 Offers 180km Range | Sakshi
Sakshi News home page

ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ కొత్త బైక్‌.. రూ.లక్షకే ఆఫర్‌!

May 10 2026 8:09 AM | Updated on May 10 2026 11:12 AM

Oben Electric Launches Roar Ez at Introductory Price of 99999 Offers 180km Range

న్యూఢిల్లీ: విద్యుత్‌ మోటర్‌సైకిల్స్‌ తయారీ సంస్థ ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ తమ సరికొత్త రోర్‌ ఈవో వాహనాన్ని ఆవిష్కరించింది. తొలి 10,000 మంది కస్టమర్లకు దీన్ని రూ. 99,999 (ఎక్స్‌ షోరూం) ప్రత్యేక ధరకి అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్‌ మధుమిత అగ్రవాల్‌ తెలిపారు. ఆ తర్వాత రేటు రూ. 1,24,999గా (ఎక్స్‌ షోరూం) రూ. 777 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

జూన్‌ నుండి టెస్ట్‌ రైడ్స్, డెలివరీలు ప్రారంభమవుతాయి. దీని సర్టిఫైడ్‌ రేంజి 180 కి.మీ.గా, టాప్‌ స్పీడ్‌ గంటకి 110 కి.మీ.గా ఉంటుంది. స్మార్ట్‌ఐక్యూ ఫీచరు వల్ల డ్రైవింగ్‌ తీరుతెన్నులను బట్టి 15 శాతం అధిక రేంజి లభిస్తుంది. మోటర్‌సైకిల్స్‌లో తొలిసారిగా సీట్‌ కింద 10 లీటర్ల స్టోరేజీ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement