వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ | Natural Diamond Jewelry Market Set to Surge to Rs 1.5 Lakh Crore by 2030 | Sakshi
Sakshi News home page

వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్‌

Apr 12 2026 12:49 PM | Updated on Apr 12 2026 1:31 PM

Natural Diamond Jewelry Market Set to Surge to Rs 1.5 Lakh Crore by 2030

ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్‌ గ్రూప్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

భారత్‌లో నేచురల్‌ డైమండ్‌ జ్యుయలరీ మార్కెట్‌ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది. డైమండ్స్‌ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్‌ జెడ్, మిలీనియల్స్‌ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.

ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్‌ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్‌ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ ఎస్‌వీపీ శ్వేతా హరిత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement