
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతోపాటు దేశంలోని వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య భారతానికి 100 ఏళ్లు వచ్చే వరకు నరేంద్రమోదీ దేశానికి సేవ చేస్తూనే ఉండాలని అందులో తెలిపారు.
‘ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 145 కోట్ల మందికి ఇదో పండగ రోజు. భారతదేశంలోని మొత్తం వ్యాపార సమాజం తరఫున, రిలయన్స్, అంబానీ కుటుంబం తరఫున, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం అమృత్ కాల్‌లో మోదీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశానికి 100 ఏళ్లు నిండిన నాటికి కూడా మోదీ భారతదేశానికి సేవ చేస్తూనే ఉండాలనేది కోరిక’ అని చెప్పారు.
#WATCH | "It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100...", says Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, on PM Modi's 75th birthday
He says, "Today is a festive day for 1.45 billion… pic.twitter.com/u2NJSTMV3R— ANI (@ANI) September 17, 2025