Meta: ఎందుకింత ద్వేషం.. అవసరమా ఈ హింస..

Meta Revealed The Data Of Blocked content Which are Related to Hatred and Violence] - Sakshi

సోషల్‌ మీడియాలో విద్వేషం, హింసా పూరిత కంటెంట్‌ పెరుగుతోంది. విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ హింసను ప్రోత్సహించే పోస్టింగులను కట్టడి చేసేందుకు ఓ వైపు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతుంటే మరోవైపు సోషల్‌ మీడియాలోకి జనాల మెదళ్లను చెదలు పట్టించే కంటెంట్‌ పెరుగుతూ రావడం ఆందోళనకరంగా మారింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌లకు సంబంధించి మెటా తాజాగా ఏప్రిల్‌కి సంబంధించి  విడుదల చేసిన ఫలితాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 

మెటా మే 31న విడుదల చేసిన గణాంకాల్లో ఏప్రిల్‌ నెలలో ఫేస్‌బుక్‌లో విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించి 52,300ల కంటెంట్‌ను నిషేధించినట్టు ప్రకటించింది. అంతకు ముందు నెల మార్చిలో ఈ సంఖ్య 38,600లగా నమోదు అయ్యింది. అంటే మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లో విద్వేషపూరిత కంటెంట్‌ 37.82 శాతం ఎక్కువగా వచ్చింది. అయితే ముందుగానే ఈ విషయం పసిగట్టిన ఫేస్‌బుక్‌ ఈ సమాచారం జనబాహుళ్యంలోకి పోకుండా అడ్డుకట్ట వేసింది.

ఇక హింసను ప్రోత్సహించే విధంగా ఉన్న కంటెంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏప్రిల్‌కి సంబంధించి 77,000ల వరకు వచ్చాయి. మార్చిలో ఈ సంఖ్య 41,300లుగా ఉంది. ఒక్క నెలలో హింసా పూరిత కంటెంట్‌ ఇన్‌స్టాకి 86 శాతం పెరిగింది. హింస, ద్వేషం పెంచే విధంగా ఉన్న కంటెంట్‌ను ఎప్పటికప్పుడు మెటా నిషేధిస్తోంది. ఇలా నిషేధించిన కంటెంట్‌లో వీడియోలు, ఫోటోలు, రాతకు సంబంధించినవి ఉన్నట్టు మెటా వెల్లడించింది. ఇక ప్రమాద ఘటనలకు సంబంధించిన కంటెంట్‌ విషయంలో యూజర్ల మనోభావాలు దెబ్బతినకుండా చాలా సార్లు వీడియోలు, ఫోటోలు  బ్లర్‌ చేస్తున్నట్టు మెటా పేర్కొంది. 

చదవండి: Who Is Javier Olivan: ఆలస్యానికి తావేలేదు.. మెటా కొత్త సీవోవో ఇతనే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top