ఐటీ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు.. టెక్‌ కంపెనీలు అందుకు ఒప్పుకుంటాయా? | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు.. టెక్‌ కంపెనీలు అందుకు ఒప్పుకుంటాయా?

Published Fri, Feb 16 2024 5:16 PM

Man Seeks rs43 Lakh Package Companies With Free Food - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆర్ధిక మాంద్యం భయాలు ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు స్టార్టప్‌ల నుంచి పెద్ద కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మరో కొత్త కంపెనీలో చేరడం పరిపాటిగా మారింది. 

వీరిలో కొంత మంది సంస్థలు తమని తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేయగా.. ఎక్కువ మంది తమకు మంచి సమయం ఇప్పుడు ప్రారంభమైందనే సోషల్‌ మీడియా వేదికగా తమ అనుభవాల్ని షేర్‌ చేస్తున్నారు. పైన పేర్కొన్న రెండు కేటగిరిలకు చెందిన ఉద్యోగులకు కాకుండా.. మూడో రకం కేటగిరీ ఉద్యోగులు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సంస్థలు ఉద్యోగులపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటుంటే ఓ ఐటీ ఉద్యోగి తన కోరికల చిట్టా విప్పాడు. ‘ నాకు 4.5 ఏళ్ల అనుభవం ఉంది. ఏడాదికి రూ.43 లక్షల శాలరీ తీసుకుంటున్నాను. కానీ నెలవారీ భోజనానికి పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. అందుకే రోజుకి నాలుగు సార్లు ఫ్రీగా భోజనం స్పాన్సర్‌ చేసే కంపెనీల కోసం వెతుకుతున్నాను. మంచి ప్రొటీన్ ఫుడ్ అందించే కంపెనీల్లో చేరడం, మొత్తం 4 మీల్స్ కోసం ఫుడ్ ఆఫర్ చేసే కంపెనీల గురించి ఆలోచిస్తున్నాను. నేను గూగుల్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నాను. నా కొరికల్ని నెరవేర్చే కంపెనీలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. 

ఆ ట్వీట్‌ను ఉద్యోగులు తమ కెరియర్‌ గురించి చర్చలు జరిపే నెట్‌వర్క్‌ ‘గ్రేప్‌వైన్‌’ ఫౌండర్‌ త్రిపాఠి షేర్‌ చేశాడు. అందులో ‘తమ ప్రాధాన్యతలు, భవిష్యత్తు గురించి చాలా స్పష్టత ఉన్న మీలాంటి వ్యక్తులను నేను చాలా అరుదుగా చూస్తాను. మంచి భోజనం కోసం జాబ్‌ మారాలని అనుకున్నారు. మీ ఆలోచన చాలా బాగుందని పేర్కొన్నాడు.  

త్రిపాఠి షేర్‌ చేసిన పోస్ట్‌ను ఇప్పటి వరకు సుమారు 77 వేల మంది కంటే ఎక్కువమంది వీక్షించారు. అందులో కొంత మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.  

‘అతను జొమాటోలో చేరాలి.. వారే చూసుకుంటారు’ అని మరొకరు సూచించారు. 

భారీ మొత్తంలో శాలరీ ప్యాకేజీ తీసుకుంటున్నా.. ఫ్రీ ఫుడ్‌ కోసం ఎంతలా తపిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఓ నెటిజన్‌ అభిప్రాయం వ్యక్తం చేయగా..  

ఈ సీటీసీ అతను తన సొంత ఫిట్‌నెస్ బ్రాండ్‌ను ప్రారంభించుకోవచ్చని మరొకరు రాశారు.  

చదవండి👉 :  ఓలా మైండ్‌బ్లోయింగ్‌ ఆఫర్‌..అస్సలు మిస్సవ్వద్దు!

Advertisement

తప్పక చదవండి

Advertisement