
కేటీఎం కంపెనీ ఇండియన్ మార్కెట్లో.. 390 ఎండ్యూరో ఆర్ బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ చాలావరకు ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కేటీఎం 390 అడ్వెంచర్ మాదిరిగా ఉంటాయి. అయితే దీని ధర స్టాండర్డ్ 390 అడ్వెంచర్ కంటే రూ. 31,000 తక్కువ.
కొత్త కేటీఎం 390 ఎండ్యూరో ఆర్.. సస్పెన్షన్ ట్రావెల్, గ్రౌండ్ క్లియరెన్స్ రెండూ కూడా భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 46 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఇదీ చదవండి: మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!
సింగిల్-పీస్ సీటులోనే విలీనమైన ఫ్యూయెల్ ట్యాంక్ ఇక్కడ చూడవచ్చు. దీని కెపాసిటీ 9 లీటర్లు. ఈ బైక్ ప్రత్యేకింగ్ ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.