బంపర్ ఆఫర్: ఆ కారుపై రూ.3.75 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్

Kia Announce Special Discounts Upto 3.75lakh For Carnival Mpv - Sakshi

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా భారత్‌ మార్కెట్‌ పై దృష‍్టి సారించింది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్రీమియం వేరియంట్‌ కియా కార్నివాల్‌ ఎంపీవీ కారుపై రూ.3.75 లక్షల వరకు లబ్ధి చేకూరేలా బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేసిన కష్టమర్లకు ఆఫర్‌ వర్తిస్తుందని కియో ప్రతినిధులు వెల్లడించారు. 

ఈ కారు అసలు ధర రూ.24.95 లక్షలు ఉండగా..షోరూమ్‌ లో దీని ధరపై రూ .2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్తో పాటు వార్షిక నిర్వహణ ఖర్చులు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలతో పాటు ఇతర ఖర్చుల కింద రూ.1.25లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ కారును రూ .21.20లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
 
కాగా ,గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌ పోలో  2020 కియా కార్నివాల్‌ ఎంపీవీ కారును ఇండియన్‌ మార్కెట్‌లో కియా విడుదల చేసింది. ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఈ కారు నాలుగు వరుసలు, తొమ్మిది సీట్లతో ఏర్పాటైంది. కారు లోపలి భాగం నప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీతో డిజైన్‌ చేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

200హెచ్‌పీ పవర్‌ శక్తిని గరిష్టంగా 440 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్‌ ఆటోమెటిక్‌ గేర్‌ బాక్స్‌  ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌, క్యాబిన్‌లో అత్యాధునిక కార్ల టెక్నాలజీకి సపోర్ట్ చేసే సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top