మేడిన్‌ ఇండియా రేంజ్‌ రోవర్‌ | Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఇండియా రేంజ్‌ రోవర్‌

Published Sat, May 25 2024 5:51 AM

Jaguar Land Rover to produce the iconic Range Rover in India

రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ సైతం తయారీ

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ నిర్ణయం

ప్రస్తుతం యూకే ప్లాంటులో ఉత్పత్తి
 

 

ముంబై: మేడిన్‌ ఇండియా రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. 

ప్రస్తుతం యూకేలోని సోలహల్‌ వద్ద ఉన్న జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ప్లాంటులో తయారైన రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది.

 రానున్న రోజుల్లో రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్‌ రోవర్‌ వెలార్, రేంజ్‌ రోవర్‌ ఇవోక్, జాగ్వార్‌ ఎఫ్‌–పేస్, డిస్కవరీ స్పోర్ట్‌ అసెంబుల్‌ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్‌ఆర్‌ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం.

Advertisement
 
Advertisement
 
Advertisement