సెజ్‌ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు | India Grants SEZ Units Duty Relief Domestic Sales Boost | Sakshi
Sakshi News home page

సెజ్‌ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు

Apr 2 2026 8:20 AM | Updated on Apr 2 2026 8:20 AM

India Grants SEZ Units Duty Relief Domestic Sales Boost

దేశీ మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటు

ప్రస్తుత సుంకాలపై తగ్గింపులు

బలహీన డిమాండ్‌ నేపథ్యంలో నిర్ణయం 

ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌)ని యూనిట్లకు ఏడాది కాలం పాటు సుంకాల్లో రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూనిట్లు తమ ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపింది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం సెజ్‌ యూనిట్లలో తయారైన వస్తువులపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గనుంది. కొన్ని కేసుల్లో అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ) కూడా వర్తించదు. రసాయనాలు, ఎరువులు, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, మెషినరీ ఇలా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులకు ఈ ప్రయోజనాలు అమలు కానున్నాయి. 2025 మార్చి 31కి ముందు సెజ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించిన యూనిట్లకే ఈ మినహాయింపు వర్తిస్తాయని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో తాము పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకుండా ఉన్నామని, వస్తువులను దేశీ మార్కెట్లో రాయితీ రేట్లపై విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎగుమతి యూనిట్లు డిమాండ్‌ చేయడం గమనార్హం.

తక్కువ రేట్లు

సెజ్‌ యూనిట్లలో తయారైన వస్తువులకు ప్రస్తుతం అమలవుతున్న 7.5 శాతం స్థానంలో 6 శాతం, 10 శాతం బదులు 9 శాతం, 12.5 శాతం, 15 శాతం బదులు 10 శాతం రేట్లు వర్తిస్తాయి. అలాగే, 20 శాతం అమలయ్యే చోట 12.5 శాతం, 20–30 శాతం బ్రాకెట్‌లోని వాటికి 15 శాతం, 30–40 శాతం సుంకాల పరిధిలోని వాటికి 20 శాతమే ఇకపై అమలు కానున్నాయి.

ఇదీ చదవండి: ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..

Advertisement
 
Advertisement
Advertisement