ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అక్టోబర్ 24తో ముగిసిన వారంలో 6.925 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 695.355 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం వారంలో నిల్వలు 4.496 బిలియన్ డాలర్లు పెరిగి 702.28 బిలియన్ డాలర్లకు చేరాయి.
తాజాగా అక్టోబర్ 24తో ముగిసిన వారంలో రిజర్వ్‌లలో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.862 బిలియన్ డాలర్లు తగ్గి 566.548 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. పసిడి నిల్వల విలువ 3.01 బిలియన్ డాలర్లు క్షీణించి 105.536 బిలియన్ డాలర్లకు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 58 మిలియన్ డాలర్లు తగ్గి 18.664 బిలియన్ డాలర్లకు నెమ్మదించాయి.


