Hyundai i20 Era : ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి

Hyundai Will launch i20 Era Trim To Compete With Tata Altroz And Nexa Baleno - Sakshi

న్యూఢిల్లీ: హ్యచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో ధరల యుద్ధానికి హ్యుందాయ్‌ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్‌లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

మాగ్నాకంటే తక్కువ
హ్యచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌ ఐ20కి మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్‌లో మాగ్నా వేరియంట్‌ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌లో మాగ్నా ట్రిమ్‌ వేరియంట్‌ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్‌ మోడల్‌ను మార్కెట్‌లోకి తెస్తోంది.

రూ. 6 లక్షల దగ్గర
కేవలం పెట్రోల్‌ వెర్షన్‌లోనే లభించే హ్యుందాయ్‌ ఐ20 ఎరా ట్రిమ్‌ మోడల్‌ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్‌లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్‌ ప్రైస్‌ ఉండేలా హ్యుందాయ్‌ జాగ్రత్త పడుతోంది.

నో కాంప్రమైజ్‌
ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్‌ క్వాలిటీలో హ్యుందాయ్‌ పెద్దగా కాంప్రమైజ్‌ కావడం లేదు.పవర్‌ స్టీరింగ్‌, ఫ్రంట్‌ పవర్‌ విండోస్‌, మాన్యువల్‌ ఎయిర్‌ కండీషన్‌, మాన్యువల్‌ గేర్‌ సిస్టమ్‌ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్‌ విండోస్‌కి బదులు మాన్యువల్‌ విండోస్‌ అందించింది. నేటి ట్రెండ్‌కి తగ్గ ఇన్ఫోంటైన్‌ సిస్టమ్‌ కాకుండా బేసిక్‌  ఇన్ఫోంటైన్‌ సిస్టమ్‌ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్‌ వెల్లడించనుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top