లగ్జరీ ఫ్లాట్‌ కొన్నహెచ్‌పీ ఇండియా ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా  

HP India MD Ipsita Dasgupta buys luxury apartment in Mumbai - Sakshi

హెచ్‌పీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇప్సితా దాస్‌గుప్తా, ముంబైలోని వర్లీ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అక్టోబర్ 2023లో హెచ్‌పీ ఇండియాకు ఎండీ నియమితులయ్యారు ఇప్సితా. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 22.52 కోట్ల రూపాయలకు 2,964 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు ఇప్సితా. 

తాజా నివేదికల ప్రకారం అరేబియా సముద్రం, బాంద్రా-వర్లీ సీ లింక్ వ్యూతో , సూపర్-ప్రీమియం ప్రాజెక్ట్ రహేజా ఆర్టీసియాలోని  4వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను ఆమె సొంతం చేసుకున్నారు.  ఈ ఫ్లాట్‌లో 100 చదరపు అడుగుల బాల్కనీ, మూడు కార్ పార్కింగ్ స్లాట్‌లు ప్రత్యేక ఆకర్షణ. ప్రాపర్టీ టెక్‌ సంస్థ Zapkey సమాచారం ప్రకారం  ఈ డీల్ అక్టోబర్ 26న రిజిస్టర్  అయింది.  అయితే  ఈ డీల్‌పై ఇటు కె రహేజా కార్ప్, ఇటు హెచ్‌పీ  ఇండియా గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

కాగా  2023 ఏడాదిలో  10 నెలల కాలంలో  1.04 లక్షలకు పైగా ఆస్తి రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి.  ముఖ్యంగా 2023 ఆగస్టులో, Paytm పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురీందర్ చావ్లా, సెంట్రల్ ముంబైలోని లోయర్ పరేల్‌లోని ఇండియాబుల్స్ స్కై ఫారెస్ట్‌లో 2,516 కార్పెట్ ఏరియాతో 20 కోట్ల రూపాయలకు డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 2022లో ముంబైలోని టాప్ 100 హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో రూ. 43,000 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 2.5 శాతం క్షీణించిందని జాప్‌కీ డాట్‌ కామ్‌ విశ్లేషణలో తేలింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top