ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌, ఉచిత డేటా ఆఫ‌ర్‌..ఎంత‌కాలం అంటే?

How To Get Tata Play Fiber Plan For Free - Sakshi

ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌ముఖ బ్రాండ్ బ్యాండ్ స‌ర్వీస్ సంస్థ టాటా ప్లే ఫైబ‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం ఆ సంస్థ రూ.1150 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను దాని కొత్త సబ్‌స్క్రైబర్‌లకు ఒక నెల పాటు ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపింది.  

‘ట్రై అండ్ బై’ పథకం కింద ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక నెలపాటు ఉచితంగా బ్రాండ్ బ్యాండ్ ను వినియోగించుకోవ‌చ్చు. అయితే కంపెనీ వినియోగదారులు ముందుగా సర్వీస్ నాణ్యతను పరీక్షించి, ఆపై కనెక్షన్‌ని కొనుగోలు చేస్తే ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందొచ్చ‌ని టాటా ప్లే ఫైబ‌ర్ నిర్వాహ‌కులు తెలిపారు.  

రూ.1150 ప్లాన్ కింద
రూ.1150 ప్లాన్ కింద వినియోగదారులకు 200 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొంద‌వ‌చ్చు. కొత్త సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్ ఉచితంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ  వినియోగదారులు రూ.1500 ఒక్కసారి రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రై అండ్ బై స్కీమ్ కంపెనీ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్ న్యూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, ముంబైతో పాటు దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండ‌నుందని ఆ సంస్థ నిర్వ‌హాకులు ప్ర‌క‌టించారు.  

ట్రై అండ్ బై ఇనిషియేటివ్ కస్టమర్‌లు 1000జీబీ హై స్పీడ్ డేటాను ఉచితంగా పొందుతారు. కంపెనీ నుండి పూర్తి రీఫండ్ పొందడానికి అర్హత పొందడానికి 30 రోజులలోపు కనెక్షన్‌ని రద్దు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత రద్దు చేస్తే రూ.500 స‌ర్వీస్ ఛార్జ్ విధించి, మిగిలిన రూ.1000 వాపస్ ఇస్తుంది.  
  
ఆఫ‌ర్ పొందాలంటే 
కనెక్షన్‌తో పాటు టాటా ప్లే ఫైబర్ ట్రయల్ వ్యవధిలో వినియోగదారులకు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. దీంతో పాటు కనీసం 3 నెలల పాటు 100 ఎంబీపీఎస్‌ ప్లాన్ ను ఎంపిక చేసుకుంటే పూర్తి రూ.1500 రీఫండ్ లభిస్తుంది. 3 నెలల పాటు 50 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ని ఎంచుకుంటే రూ. 500 మాత్రమే వాపస్ పొంద‌వ‌చ్చు. మిగిలిన రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్‌లో ఉంటుంది. నెలవారీ ప్లాన్‌ను పొందినట్లయితే, మూడు నెలల వినియోగ తర్వాత  రూ.1000 వాపసు చేయబడుతుంది. మిగిలిన రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ వాలెట్‌లో ఉంటుంద‌ని టాటా ప్లే ఫైబ‌ర్ వెల్ల‌డించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top