నెలవారీ జీఎస్‌టీ రిటర్నులకు గడువు పెంపు

GST: Monthly return filing deadline extended till June 26 - Sakshi

జూన్‌ 26 దాకా పొడిగింపు

న్యూఢిల్లీ: నెలవారీగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సేల్స్‌ రిటర్నులను దాఖలు చేసేందుకు మే నెలకు సంబంధించిన గడువును కేంద్రం 15 రోజుల పాటు పొడిగించింది. తాజా డెడ్‌లైన్‌ జూన్‌ 26గా ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సారథ్యంలో మే 28న సమావేశమైన జీఎస్‌టీ మండలి .. కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిబంధనల సడలింపును కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కాంపోజిషన్‌ డీలర్లు 2020-21కి గాను వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును జూలై 31 దాకా పొడిగించింది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ (సీబీఐసీ).. ఈ మేరకు ట్వీట్లు చేసింది.

చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top