గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ లిస్ట్‌లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే..

Google Year in Search 2021 Elon Musk was searched by Indians - Sakshi

Google Year in Search 2021.. Billionaire Elon Musk was Searched Extensively By Indians: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెర్చింజన్‌ గూగుల్‌ ‘ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ 2021’ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. కరోనా హవాను తట్టుకుని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. భారత్‌లో ఓవరాల్‌ టాప్‌ సెర్చ్‌ లిస్ట్‌లో నిలిచింది. ఇక మిగతా జాబితాలోనూ వార్తల్లో నిలిచిన వైవిధ్యమైన అంశాలు, కరోనా సంబంధిత టాపిక్స్‌ సెర్చ్‌ ట్రెండ్‌లో టాప్‌లో నిలిచాయి.

సాధారణంగా సినీ సెలబ్రిటీలు, ముఖ్యంగా సన్నీ లియోన్‌, కత్రినా కైఫ్‌ లాంటి ఫీమేల్‌ సెలబ్రిటీల గురించి మనోళ్ల వెతుకులాట ఎక్కువగా కొనసాగుతూ వచ్చేది. అయితే ఈ ఏడాది కొంచెం భిన్నంగా Google Year in Search 2021లో భారతీయుల వెతుకులాట కొనసాగింది. ఇక పర్సనాలిటీ లిస్ట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా టాప్‌లో నిలవగా.. ఈ లిస్ట్‌లో ఒక్కరు తప్ప అంతా మన దేశస్తులే ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌

278 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు ఎలన్‌ రీవ్‌ మస్క్‌.   ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీ స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడిగా, టెస్లా సీఈవోగా కొనసాగుతున్న ఎలన్‌ మస్క్‌.. ఇండియన్‌ గూగుల్‌ ఇన్‌ సెర్చ్‌ 2021 లిస్ట్‌లో ఐదవ స్థానంలో నిలిచాడు. భారత్‌లో టెస్లా ఈవీ ఎంట్రీ ప్రయత్నాలు, స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీ  ‘స్టార్‌లింక్‌’ కనెక్షన్‌ ఇచ్చే ప్రయత్నాలతో పాటు స్పేస్‌ఎక్స్‌ ప్రయోగాలు, పలు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం కారణంగా ఎలన్‌ మస్క్‌ గురించి ఎక్కువగా వెతికారు భారతీయులు. 

క్లిక్‌: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1!

మరోవైపు పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. ఇచ్చే ప్రకటనలు, క్రిప్టో కరెన్సీ మీద తన వైఖరి, టెస్లాలో షేర్ల అమ్మకం, సోషల్‌ మీడియాలో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌.. వెరసి ఎలన్‌ మస్క్‌ గురించి భారతీయుల్లో ఒకరకమైన ఆసక్తిని కలగజేసింది.  

ఇంకోవైపు వ్యక్తిగత అంశాలతోనూ 50 ఏళ్ల ఎలన్‌ మస్క్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఊహకందని చేష్టలతో ‘థగ్‌ లైఫ్‌’ పర్సనాలిటీగా ఎలన్‌ మస్క్‌కి భారతీయ యువతలోనూ మాంచి క్రేజ్‌ దక్కింది. అంతేకాదు ఆనంద్‌ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఎలన్‌ మస్క్ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కూడా.

చదవండి: రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్‌ చేయండి సార్‌''..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top