Google Chrome: మీరు వాడే క్రోమ్‌ బ్రౌజర్‌ సెక్యూర్‌గా ఉందో లేదో ఇలా చెక్‌ చేయండి..

Google Warns Chrome Users Of A Huge Security Threat - Sakshi

Google Warns Chrome Users Of A Huge Security Threat: మనలో చాలా మంది ఎప్పుడు ఎదో ఒక విషయాన్ని తెలసుకునేందుకు బ్రౌజ్‌ చేస్తూనే ఉంటాం. బ్రౌజ్‌ చేసేందుకు గాను మనలో చాలా మంది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌పైనే ఆధారపడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్‌ యూజర్లు గూగుల్‌ క్రోమ్‌  సొంతం. విస్తృత స్థాయిలో యూజర్ బేస్‌ ఉన్న క్రోమ్‌ బ్రౌజర్‌కు తరుచుగా సైబర్‌ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా టెక్ దిగ్గజం గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. వెంటనే క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు గూగుల్‌ తెలిపింది. గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో లైనక్స్, మాక్‌ఓఎస్‌, విండోస్ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో నెలకొన్న సమస్యలను గూగుల్‌ వెల్లడించింది. జీరో డే హ్యాక్‌ పేరిట పలు క్రోమ్‌ యూజర్లపై సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

గూగుల్‌ క్రోమ్‌పై సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు గూగుల్‌ ఉద్యోగులు గుర్తించారు. హై-రిస్క్‌ హ్యక్‌ నుంచి యూజర్లను రక్షించడం కోసం వెంటనే క్రొమ్‌ అప్‌డేట్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలని గూగుల్‌ పేర్కొంది. తాజాగా గూగుల్‌ తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో మరింత సెక్యూర్డ్‌ బ్రౌజింగ్‌ అనుభూతిని పొందవచ్చును.   

మీ గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ సురక్షితంగా ఉందో లేదో ఇలా చూడండి..

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయండి.
  • సెర్చ్‌ బార్‌ పక్కన ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్‌ చేసి ‘సెట్టింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • సెట్టింగ్‌ ఆప్సన్‌లో కిందికి స్క్రోల్‌ చేసి ‘అబోట్‌ క్రోమ్‌’ను సెలక్ట్‌చేయండి. 
  • అబోట్‌ క్రోమ్‌ సెలక్ట్‌ చేశాక మీకు ఆప్లికేషన్‌ క్రోమ్‌ వర్షన్‌ కన్పిస్తోంది.
  • మీరు వాడే క్రోమ్‌ వెర్షన్‌  94.0.4606.61 ఉంటే మీరు వాడే బ్రౌజర్‌ సురక్షితంగా ఉన్నట్లు..లేకపోతే వెంటనే గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి అప్‌డేట్‌ చేయండి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top