
మళ్లీ బంగారం, వెండి.. మెరుస్తున్నాయి. సోమవారం 2 శాతంపైగా జంప్‌చేసిన వీటి ధరలు నేటి ట్రేడింగ్‌లోనూ.. జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 181 పెరిగి రూ. 53,456 వద్ద ప్రారంభమైంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 859 బలపడి రూ. 70,014 వద్ద ట్రేడవుతోంది. కొద్ది రోజుల క్రితం సరికొత్త గరిష్ట రికార్డులను చేరాక ఇటీవల బంగారం, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం జోరు..
సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1048 దూసుకెళ్లి రూ. 53,275 వద్ద నిలిచింది. తొలుత రూ. 53,443 వరకూ లాభపడినప్పటికీ ఒక దశలో రూ. 52,113 వరకూ డీలా పడింది. ఇక వెండి కేజీ రూ. 1,984 జంప్‌చేసి రూ. 69,155 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో రూ. 70,246 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 67,030 వద్ద కనిష్టానికీ చేరింది.
కామెక్స్‌లో అప్..
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం లాభంతో 2,005 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,995 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 1.2 శాతం బలపడి 28.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పురోగమించాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్ ధర 2 శాతం ఎగసి 1998 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్‌లో 1985 డాలర్ల ఎగువన ముగిసింది. ఇక వెండి 6 శాతం జంప్‌చేసి 27.75 డాలర్ల వద్ద స్థిరపడింది.