దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం (జూలై 19) పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. బంగారం ధరలు దిగివస్తుడడంతో కొనుగోలుదారులో ఆనందం వ్యక్తం అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో.. 
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ.490 తగ్గింది. దీంతో రూ. 74,350 లకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా రూ.550 క్షీణించి రూ.68,150 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.450 తగ్గి రూ.68,300 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి రూ.74,500 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గి రూ.68,750 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.75,000 వద్దకు వచ్చింది.
వెండి ధరలూ..
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి రేటు భారీగా క్షీణించింది. హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి రూ.1450 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,750 లకు దిగివచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
