80.4 శాతానికి ద్రవ్యలోటు | Fiscal deficit reaches 80 Percent of FY26 target | Sakshi
Sakshi News home page

80.4 శాతానికి ద్రవ్యలోటు

Mar 31 2026 4:44 PM | Updated on Mar 31 2026 4:49 PM

Fiscal deficit reaches 80 Percent of FY26 target

ఫిబ్రవరి చివరికి రూ.12.52 లక్షల కోట్లు

కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటు లక్ష్యంలో 80.4 శాతానికి సమానం. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 85.8 శాతంగా ఉండడం గమనించవచ్చు.

2025–26 జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. కేంద్రానికి రూ.27.91 లక్షల కోట్ల ఆదాయం ఫిబ్రవరి చివరికి నాటికి వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి 82 శాతం సమకూరింది. రూ.21.45 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.5.8 లక్షల కోట్లు పన్నేతర రూపంలో వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement