
4–4.25 శాతానికి చేరిన ఫండ్స్ రేటు
వాషింగ్టన్ డీసీ: యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గించేందుకు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) తాజాగా వడ్డీ రేటులో 0.25 శాతం కోతకు ఓటు వేసింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4–4.25%కి దిగివచ్చింది.
గత ఐదు పాలసీ సమీక్షలలో యథాతథ వడ్డీ రేటు (4.25–4.5%) అమలుకే మొగ్గు చూపిన ఫెడ్ 9 నెలల తదుపరి రేట్ల కోతకు నిర్ణయించింది. తదుపరి నిర్వహించే విలేకరుల సమావేశంలో వచ్చే ఏడాది జూన్‌కల్లా మరో రెండుసార్లు రేట్లను తగ్గించే సంకేతాలివ్వనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికితోడు ఉపాధి మార్కెట్ క్షీణించడం రేట్ల కోతకు కారణమైనట్లు విశ్లేíÙంచారు. కాగా.. గత కేలండర్ ఏడాది (2024)లో ఫెడ్ 3 సార్లు వడ్డీ రేటులో కోత పెట్టిన సంగతి తెలిసిందే.