ఫేస్‌బుక్‌ న్యూస్‌.. కంటెంట్‌కు తగిన చెల్లింపులు!

Facebook News Coming To More Countries Soon Pay For Content - Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ప్రచురణకర్తలకు శుభవార్త చెప్పింది. పలు దేశాల్లో ఫేస్‌బుక్‌ న్యూస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంస్థ... కంటెంట్‌కు తగిన పారితోషికం చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది  వినియోగ దారులతో అగ్రస్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌ అమెరికాలో ఇప్పటికే వార్తా సేవల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ పరిధిని యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో ఈ మేరకు విధివిధానాలు రూపొందించనున్నట్లు వెల్లడించింది. (చదవండి: మళ్లీ వివాదంలో ‘ఫేస్‌బుక్‌’)

ఈ విషయం గురించి ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ న్యూస్‌ పార్టనర్‌షిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంప్‌బెల్‌ బ్రౌన్‌ తన బ్లాగులో కీలక విషయాలు వెల్లడించారు. కంటెంట్‌  క్రియేటర్స్‌, పబ్లిషర్లకు డబ్బు చెల్లించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కంటెంట్‌ క్రియేట్‌ చేసి సరికొత్త బిజినెస్‌ మోడల్‌తో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. న్యూస్‌ ఇండస్ట్రీకి ఊతమిచ్చేలా భారీ స్థాయిలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫేస్‌బుక్‌కు పిలుపు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top