నాసా డార్ట్‌ ప్రయోగం.. ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర రీట్వీట్‌

Elon Musk Avenge The Dinosaurs Tweet To Nasa Over Dart - Sakshi

విషయం ఎలాంటిదైనా తనకు లాభం చేకూరేది అయితే చాలానుకునే తత్వం ఎలన్‌ మస్క్‌ది. ఈ అపరకుబేరుడు స్పేస్‌ఎక్స్‌ కోసం అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే  నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డార్ట్‌ ప్రయోగంపై స్పందించాడు. 

భూగ్రహం వైపు దూసుకొస్తున్న అతిపెద్ద ఆస్టరాయిడ్‌ ఒకదానిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టించాలన్న ప్రయత్నమే డార్ట్‌. భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం ఎలన్‌ మస్క్‌ Elon musk కే చెందిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌9 రాకెట్‌ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపించింది నాసా. అయితే ఈ ప్రయోగంపై మస్క్‌ తన స్టయిల్‌లో స్పందించాడు. 

‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ అంటూ నాసా ట్వీట్‌కు బదులిచ్చాడు ఎలన్‌ మస్క్‌. బిలియన్ల సంవత్సరాల క్రితం మెసోజోయిక్‌ Mesozoic Era యుగంలో ఆస్టరాయిడ్‌లు భూమిని ఢీకొట్టి డైనోసార్లు అంతరించిన విషయం తెలిసిందే కదా!. ఇప్పుడు ఆస్టరాయిడ్‌లను నాశనం చేసి డైనోసార్లకు బదులు ప్రతీకారం తీర్చుకోండనే ఉద్దేశంతో మస్క్‌ ట్వీటేశాడన్నమాట. ఈ ట్వీట్‌కు మస్క్‌ ఫాలోవర్స్‌ నుంచి హ్యూమర్‌తో కూడిన రిప్లైలు వస్తున్నాయి.

చదవండి: రష్యా ఉల్కాపాత వినాశనం గుర్తుందా?.. డార్ట్‌ అందుకే! 

ఇదిలా ఉంటే డార్ట్‌ తన పని పూర్తి చేయడానికి ఏడాది.. అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు ఆస్టరాయిడ్‌ గనుక నాశనం అయితే.. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్‌లను, ఉల్కలను డార్ట్‌ లాంటి మరిన్ని ప్రయోగాలతో దారి మళ్లించడమో, నాశనం చేయడమో చేస్తుంది నాసా.

చదవండి: పిరికి డైనోసార్లు.. పక్కా వెజిటేరియన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top