మనసు దోచే ‘టాటా’ డార్క్‌ ఎడిషన్స్‌ | Sakshi
Sakshi News home page

TATA Motors : మనసు దోచే డార్క్‌ ఎడిషన్స్‌

Published Wed, Jul 7 2021 2:33 PM

Dark Edition Introduced by TATA Motors In Altroz, Nexon And Harrier Models - Sakshi

 న్యూఢిల్లీ : డార్క్‌ ఎడిషన్‌ పేరుతో సక్సెస్‌ఫుల్ మోడల్‌ కార్లకు టాటా మోటార్స్‌ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్‌, అల్ట్రోజ్‌, టాటా నెక్సాన్‌, టాటా నెక్సాన్‌ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్‌ వెహికల్స్‌ అందుబాటులోకి తేనుంది.

ధర ఎంతంటే
ఢిల్లీ షోరూమ్‌ ధరల ప్రకారం డార్క్‌ ఎడిషన్‌లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్‌ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్‌ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్‌ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్‌ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

డార్క్‌ స్పెషల్స్‌
ఆల్ట్రోజ్‌లో డార్క్‌ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్‌ కాస్మో డార్క్‌ కలర్‌ స్కీంతో ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ చేశారు. ఎల్లాయ్‌ వీల్స్‌, క్రోమ, బ్యానెట్‌, ముందు భాగంలో డార్క్‌ ఎంబ్లమ్‌ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి  గ్రాఫైట్‌ బ్లాక్‌ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్‌ ఉన్న డ్యాష్‌బోర్డ్‌, ప్రీమియం లెదర్‌ సీట్స్‌ విత్‌ డార్క్‌ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్‌ చేశారు. 

నెక్సాన్‌ ఇలా
ఇక నెక్సాన్‌లో చార్‌కోల్‌ ఎల్లాయ్‌ వీల్స్‌, సోనిక్‌ సిల్వర్‌ బెల్ట్‌లైన్‌, ట్రై యారో డ్యాష్‌బోర్డ్‌ , లెదర్‌ సీట్లు, డోర్‌ ట్రిమ్స్‌ అండ్‌ ట్రై యారో థీమ్‌తో డిజైన్‌ చేశారు. 

నెక్సాన్‌ ఈవీలో
నెక్సాన్‌ ఈవీ డార్క్‌ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ ఇచ్చారు. సాటిన్‌బ్లాక​ బెల్ట్‌లైన్‌, చార్‌కోల్‌ వీల్‌ ఎల్లాయిస్‌ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్‌ థీమ్‌ ఫాలో అయ్యారు. 

హ్యారియర్‌తో మొదలు
డార్క్‌ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ వివేక్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్‌ మోడల్‌లో డార్క్‌ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. హ్యారియర్‌ అమ్మకాల్లో డార్క్‌ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్‌ ఎడిషన్స్‌ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. 


 

Advertisement
 
Advertisement